![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -962 లో... ఫణింద్ర, మహేంద్ర ఇద్దరు కాలేజీలోకి వస్తారు. వసుధార తన క్యాబిన్ దగ్గర ఉండకపోయేసరికి ఎక్కడకు వెళ్లిందని అనుకొని ఆఫీస్ బాయ్ ని పిలిచి అడుగుతారు. మేడమ్ కి ఫోన్ రావడంతోనే త్వరగా వెళ్లి పోయిందని చెప్తాడు. ఏదో వర్క్ పై వెళ్లి ఉండి ఉంటుందని మహేంద్ర అంటాడు. అ మాటలు శైలేంద్ర వింటాడు. ఫోన్ మాట్లాడి వెళ్ళిందంటే రిషి గురించి ఏమైనా క్లూ దొరికిందా? అసలు ఈ భద్ర ఏం చేస్తున్నాడని అతని దగ్గరకి శైలేంద్ర వెళ్తాడు.
వసుధారని కనిపెట్టుకొని ఉండమని చెప్తే.. నువ్వేంటి తను బయటకు వెళ్లిన కూడా ఏమి పట్టించుకొనట్లున్నావని శైలేంద్ర అనగానే ఆవిడా కాలేజీ లోనే ఉందని చెప్తాడు. లేదు ఇందాకే వెళ్ళింది రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండవచ్చు అందుకే వెళ్ళింది. వాళ్ళు ఇద్దరు కలవకూడదు. ఆ వసుధార ఎంతో దూరం వెళ్లి ఉండదు త్వరగా ఫాలో అవ్వమని భద్రకి శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి కోసం వసుధార పెద్దయన ఫోన్ చెప్పిన అడ్రెస్ కు వెళ్తుంటుంది. అక్కడ ఉన్న షాప్ అతన్ని పెద్దాయన గురించి అడుగుతుంది. అతను తెలుసు కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదని చెప్తాడు. ఇక్కడే కూర్చోండి అతనే వస్తాడని అ షాప్ అతను చెప్తాడు. దాంతో వసుధార అక్కడే కూర్చొని పెద్దయన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. మరొక వైపు వసుధార వెనకాలే ఇద్దరు రౌడీలు తనని ఫాలో అవుతు వస్తారు. కొద్దిసేపటికి పెద్దయన వసుధార దగ్గరకి వస్తాడు. రిషి గురించి వసుధార అన్ని అడిగి తెలుసుకుంటుంది... అ తర్వాత వసుధారని పెద్దాయన తీసుకొని రిషి దగ్గరకీ వెళ్తుంటే అ రౌడీలు వాళ్ళిద్దరిని ఫాలో అవుతుంటారు.
అదే సమయంలో వసుధార ఇంకా రాలేదేంటని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రౌడీలు తమ వెనకాలే వస్తున్న విషయం గమనించిన వసుధార.. ఒక దగ్గర దాక్కోని ఆ రౌడీలని పక్కదారి పట్టిస్తుంది. అంతేకాకుండా రౌడీల వెనకాల నుండి వచ్చి కర్రతో కొడుతుంది వసుధార. అ తర్వాత పెద్దయనతో కలిసి రిషి దగ్గరకి వెళ్తుంది వసుధార. రిషిని చూసిన వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి కూడా ఎమోషనల్ అవుతాడు. రిషిని వసుధార హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |